Quantcast
Channel: జాతీయం – Telugu News
Viewing all articles
Browse latest Browse all 13

ఉత్తరప్రదేశ్ త్వరలో ట్రిలియన్ డాలర్ ఆర్ధిక శక్తిగా మారబోతోంది: మోడీ

$
0
0

లక్నో: ఉత్తరప్రదేశ్ త్వరలో ట్రిలియన్ డాలర్ ఆర్ధిక శక్తిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఈరోజు దాదాపు 60,000 కోట్ల విలువైన 81 పెట్టుబడి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఆయన ‘రికార్డు స్థాయిలో ఈ రోజు ఎన్నో ప్రాజెక్టులు యూపీ ప్రజల ముందుకు వచ్చాయి. యూపీకి ఇది ఊహించలేని పరిణామం. పారిశ్రామిక వేత్తలు జాతి నిర్మాణంలోముఖ్యపాత్ర పోషిస్తారు. దేశంలోని ఎంతోమంది యువకుల కలలు వీళ్లతోనే ముడిపడి ఉన్నాయి. రూ.60,000కోట్లు పెట్టుబడి అంటే సాధారణ విషయం కాదు. యూపీలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరగబోతోంది. యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆయనను చూస్తే అసూయగా ఉంది’ అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా 2.1 లక్షల ఉద్యోగాల కల్పన అతి తక్కువ వ్యవధిలోనే జరగనుందని తెలిపారు. ఇతరులు 70 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం కేవలం 4 ఏళ్లలో చేసిందని అన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆదాని గ్రూప్ కు చెందిన గౌతమ్ అదానీ, ఎస్సెల్ గ్రూప్ చైర్ పర్సన్ సుభాష్ చంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కుమార్ మంగళం బిర్లా, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాద్ మరియు కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

The post ఉత్తరప్రదేశ్ త్వరలో ట్రిలియన్ డాలర్ ఆర్ధిక శక్తిగా మారబోతోంది: మోడీ appeared first on Telugu News.


Viewing all articles
Browse latest Browse all 13

Latest Images

Trending Articles





Latest Images